ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ సంచలన కామెంట్స్ చేశారు. భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంకర్ యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు. ట్రంప్ ప్రమాణ స్వీకార సమయంలో నిలబడి చప్పట్లు కొట్టాడని, కానీ భారతీయులను మోసం చేస్తుంటే ఎక్కడా కనిపించడం లేదంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ సైతం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు..ఇది పూర్తిగా సిగ్గు పడాల్సిన విషయమన్నారు కేఏ పాల్.