హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు కబ్జాలను కూల్చివేశారు. నిజాంపేట రోడ్డులోని హొలిస్టిక్ ఆస్పత్రి వెనుక ఉన్న ప్రభుత్వ స్థలం చుట్టూ అక్రమంగా నిర్మించిన ప్రహరీని తొలగించారు. అదే స్థలంలో తనకు కేటాయించిన 300 గజాల ఇంటి స్థలం ఉందని, కబ్జాకు గురైందంటూ మాజీ సైనికుడు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించిన హైడ్రా కూల్చి వేసింది. వీటితో పాటు నగరంలో పలు కబ్జాలకు గురైన వాటిని కూల్చేసింది.