సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో పాటు ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి. పాలమూరు జిల్లాలో సాగు నీరు, తాగు నీటి ఎద్దడి నెలకొందని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నారాయణపూర్ రిజర్వాయర్ నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.