తమ ప్రభుత్వం శాస్త్రీయ పద్దతిలో సమగ్ర కుటుంబ సర్వే చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ కుల గణనపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమకు ఇతర కులాల పట్ల కోపం ఎందుకు ఉంటుందన్నారు. బలహీన వర్గాలకు న్యాయం చేయాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎల్పీ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. ఏమైనా అనుమానాలుంటే నివృత్తి చేసేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.