సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఢిల్లీకి రావాలంటూ పార్టీ హై కమాండ్ ఆదేశించింది. కాంగ్రెస్ శాసన సభ పక్ష ఎమ్మెల్యేలతో భేటీ కానున్నారు. సమావేశం అయిన వెంటనే సీఎంతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రావాలని స్పష్టం చేసింది. సాయంత్రం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీ కూడా హాజరు కానున్నారు. కాగా సీఎం ఢిల్లీ టూర్ పై ఉత్కంఠ నెలకొంది. తనను మార్చుతారనే ప్రచారం జోరందుకుంది.