ఏపీలో రాబోయేది మన రాజ్యమే
NEWS Feb 06,2025 04:42 am
మాజీ సీఎం జగన్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందన్నారు. ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఏడు నెలలకే విసుగు చెందారని, ఇక రాబోయేది మన రాజ్యమేనని జోష్యం చెప్పారు. పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు అధైర్య పడవద్దని అన్నారు. తాను త్వరలోనే రంగంలోకి దిగుతున్నానని, ఎవరు వస్తారో చూస్తానని హెచ్చరించారు. ఏ ఒకరిపైనా చేయి వేసినా చూస్తూ ఊరుకోనని అన్నారు.