రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సంచలన ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఘాటు లేఖ రాశారు. 2014లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే పేరుతో రూ. 100 కోట్ల ప్రజా ధనం వృధా చేసిందంటూ ఆరోపించారు. ఆనాడు చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై సీబీ సీఐడీతో విచారణ జరిపించాలని సీఎంను కోరారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తేల్చాలని డిమాండ్ చేశారు.