ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకం అమలుకు సంబంధించి తీపి కబురు చెప్పింది. ఏపీలోనే కాకుండా తెలంగాణలోని ఆస్పత్రులలో కూడా స్కీం వర్తించేలా మార్పు చేసింది. డీఎంఈ గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణలోని రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోను ఆదేశించింది.