రాష్ట్రంలో 17 లక్షల 3 వేల మంది రైతులకు చెందిన ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ఎకరం వరకు, సాగులో ఉన్న భూములకు ఇచ్చామని చెప్పారు. పథకం ప్రారంభోత్సం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకుని ఇవాల్టి వరకు మొత్తం రూ. 1124.54 కోట్లు జమ చేశామన్నారు. తమ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు తుమ్మల.