జగన్ కు ఆత్మలతో మాట్లాడే అలవాటు
NEWS Feb 06,2025 02:46 am
మంత్రి నారా లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. రాత్రి సమయంలో తనకు ఆత్మలతో మాట్లాడే అలవాటుందని ఆరోపించారు. జగన్ 1.0 నుంచే ప్రజలు ఇంకా కోలుకోలేదన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశాడని, అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని చంపాడని వాపోయారు. నాపై 23 అక్రమ కేసులు పెట్టాడన్నారు. భూములను కాజేశాడని ధ్వజమెత్తారు.