ఢిల్లీ ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీ జోరు
NEWS Feb 06,2025 02:21 am
ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు 699 మంది పోటీ పడ్డారు. అధికారంలో ఉన్న ఆప్, బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. సర్వేలు, మీడియా సంస్థలన్నీ గంప గుత్తగా బీజేపీ ఈసారి అధికారంలోకి వస్తుందని ప్రకటించాయి. కానీ ఒకే ఒక్క కేకే సర్వే మాత్రం ఆప్ పవర్ లోకి వస్తుందని, హ్యాట్రిక్ కొడుతుందని స్పష్టం చేసింది. ఈనెల 8న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి.