ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 70 స్థానాలకు గాను 699 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ గంపగుత్తగా బీజేపీ గెలుస్తుందని ప్రకటించాయి. కానీ ఏపీ, తెలంగాణకు చెందిన కేకే సర్వే మాత్రం సంచలన రిపోర్ట్ వెల్లడించింది. దేశ రాజధానిలో మరోసారి ఆప్ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. ఆప్ కు 44 సీట్లు, బీజేపీకి 26 సీట్లు వస్తాయని జోష్యం చెప్పారు.