తెలంగాణలో టెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యా శాఖ కార్యదర్శి యోగిత రిజల్ట్స్ రిలీజ్ చేశారు. టెట్ ఫలితాల్లో 42 వేల 384 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉండడంతో టెట్ ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ ముందే పరీక్ష నిర్వహించడం వల్ల అభ్యంతరం ఉండదంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో సర్కార్ ఫలితాలను విడుదల చేసింది.