ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదో తరగతి విద్యార్థులకు మండల స్థాయి ప్రజ్ఞ పాటవ పోటీలను నిర్వహించారు. సమావేశానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి నారాయణ వచ్చారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు. మండల స్థాయి పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను అందజేశారు.