హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుల వల్ల తాను రూ. 100 కోట్లు నష్ట పోయానంటూ సంచలన ఆరోపణలు చేశారు నిర్మాత సింగనమల రమేష్ బాబు. ఆ ఇద్దరితో తాను తీసిన కొమురం పులి, ఖలేజా ఫెయిల్ కావడానికి వారే కారణమంటూ వాపోయారు. దీంతో సింగనమల చేసిన కామెంట్స్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నిర్మాత బండ్ల గణేశ్. చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.