గూగుల్ క్లౌడ్ ఎండీ..డైరెక్టర్ తో లోకేష్ భేటీ
NEWS Feb 05,2025 08:48 am
గూగుల్ క్లౌడ్ ఎండీ బిక్రమ్ సింగ్, కంట్రీ డైరెక్టర్ (పబ్లిక్ సెక్టార్ అండ్ ఎడ్ టెక్) ఆశిష్ తో మంత్రి నారా లోకేష్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్ ఏర్పాటు చేయబోయే డేటా సిటికి సంబంధించి చర్చించారు. ప్రభుత్వం తరపున ఇవ్వాల్సిన అనుమతులు, భూ కేటాయింపులు, పాలసీని త్వరితగతిన ఇస్తామని, ఇందుకోసం ఎపి ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డు చురుగ్గా పనిచేస్తోందని చెప్పారు.