వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించడానికి ఎన్‌పీడీసీఎల్ ఆధ్వర్యంలో చేపడుతున్న పెండింగ్ పనులు ఈనెలాఖరు లోపు పూర్తి చేయాలని నిజామాబాద్ ఎస్‌ఈ రాపల్లి రవీందర్ సూచించారు. పవర్ హౌజ్‌లో వేసవిలో విద్యుత్ సరఫరాకు ముందస్తు జాగ్రత్తలపై డీఈలు, ఏడీఈలు, ఏఈలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామని తెలిపారు.