ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ అంతుచిక్కని వ్యాధితో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. బిర్కూర్, పోతంగల్, భీమ్‌గల్ మండలాల్లో వేలాది కోడి పిల్లలు చనిపోయాయి. వైరస్ ఒక్కొక్కటిగా..అన్ని పౌల్ట్రీ ఫామ్స్‌కు వ్యాపిస్తుండటంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు పౌల్ట్రీ రైతులు. వైరస్ ఏంటో కనిపెట్టి దానికి సంబంధించిన వ్యాక్సిన్ పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వేలాది బాయిలర్ కోళ్లు చనిపోతున్నాయి. అంతుచిక్కని వైరస్‌తో పౌల్ట్రీ ఫామ్స్‌లో మృతి చెందుతుండటం కారణంగా రైతులు, పెంపకందార్లు ఆందోళన చెందుతున్నారు.