ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర మంత్రి ఎస్. జై శంకర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓట్లు వేసేందుకు ఢిల్లీ వాసులు బారులు తీరారు. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 వేల 766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించనున్నారు.