ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సమగ్ర కుటుంబ సర్వే బక్వాస్ అంటూ కొట్టి పారేశారు మాజీ మంత్రి కేటీఆర్. తాజా సర్వే ..కుల గణన సర్వేల మధ్య తేడా వివరించారు. 2014లో కుటుంబ సర్వే జరిగినప్పుడు బీసీల సంఖ్య 51 శాతంగా తేలిందన్నారు. తాజా సర్వేలో కేవలం 46 శాతం మాత్రమే ఉన్నట్లు పేర్కొనడం దారుణమన్నారు. 51 శాతం నుంచి 46 శాతానికి ఎలా తగ్గిందంటూ ప్రశ్నించారు. ఉత్తమ్ చెప్పిన వివరాలే సీఎం వివరించారంటూ ఎద్దేవా చేశారు.