తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు.స్వామి, అమ్మ వార్లు సప్త వాహనాలపై విహరించి భక్తులను కటాక్షించారు. శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలోని ఆళ్వారు తీర్థానికి వేంచేపు చేసి చక్రస్నానం నిర్వహించారు. స్వామి అనుగ్రహం కోసం భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.