ఘనంగా రథసప్తమి వేడుకలు
NEWS Feb 05,2025 03:37 am
తిరుమలలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. భక్తులను స్వయంగా కలిసి ఏర్పాట్లు, వసతి సౌకర్యాలపై ఆరా తీశారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీర బ్రహ్మం. భక్తులకు అన్న ప్రసాదం, తాగు నీరు, పానియాలు, బిస్కెట్లు, టిఫిన్లు అందజేశారు. ఈ సందర్బంగా టీటీడీ అధికారులను అభినందించారు చైర్మన్.