ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓట్లు వేసేందుకు బారులు తీరారు ఓటర్లు. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 699 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 13 వేల 766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించనున్నారు. 3 వేల సమస్యాత్మక పోలింగ్ బూత్ లను గుర్తించారు. భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.