ఓ సామాజిక వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పార్టీ పరంగా ప్రతి ఒక్కరు క్రమశిక్షణ పాటించాల్సిందేనని అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామని చెప్పారు. ఎంతటి వారైనా సరే క్రమశిక్షణను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా రెడ్డి సంఘాల ప్రతినిధులు మల్లన్నపై డీజీపీకి ఫిర్యాదు చేశారు.