చట్ట బద్దంగా స్థానిక రిజర్వేషన్లు సాధ్యం కాక పోతే 42 శాతం సీట్లు బీసీలకు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సర్వేలో పాల్గొనని సభ్యులకు మైక్ ఇవ్వవద్దని స్పీకర్ ను కోరారు. ప్రభుత్వంపై నమ్మకం లేదన్న వాళ్లకు సభలో చర్చలో పాల్గొనే అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీల ఎమ్మెల్యేలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం.