ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై రెడ్డి సంఘాల నేతలు నిప్పులు చెరిగారు.తమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్నపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రెడ్డిలను తీవ్ర పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఓట్లు అక్కర్లేదని చెప్పడం దారుణమన్నారు. మల్లన్నను తొలగించకపోతే ఆందోళన చేపడతామని వార్నింగ్ ఇచ్చారు.