జన సేన పార్టీకి చెందిన బర్మా నాగేశ్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు కరీంనగర్ జిల్లా సీనియర్ నేత వోడ్నాల రామారావు. వేములకుర్తి చెందిన తను ఇటీవల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. తన కుటుంబాన్ని పార్టీ ఆదుకుంటుందన్నారు. జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకున్నాడని, బీమా కోసం అప్లై చేశామని, రూ. 5 లక్షల చెక్కు రాగానే అందజేస్తామన్నారు. పార్టీ హైకమాండ్ అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.