కుల గణన సర్వేతో భవిష్యత్తుకు కొత్త శకం మొదలైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశానికి తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవనుందన్నారు. రాహుల్ గాంధీ నిన్న పార్లమెంటులో తెలంగాణ ప్రభుత్వ కార్యాచరణను మొచ్చుకున్నారని చెప్పారు. బలహీనవర్గాలకు న్యాయం చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశారు. కేవలం 50 రోజుల్లోనే సమగ్ర ఇంటింటి సర్వే చేపట్టామన్నారు. ఇది ఓ రికార్డ్ అని పేర్కొన్నారు.