రాష్ట్రంలో ఇప్పటి వరకు బీసీలకు సంబంధించి ఎలాంటి సర్వే చేపట్ట లేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో సర్వే వివరాలు ప్రకటించారు. మొత్తం 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మందిని సర్వే చేశామన్నారు. ఎస్సీలు 17.43 శాతం , ఎస్టీలు 10.45 శాతం , బీసీలు 46.25 శాతం ఉన్నారని తెలిపారు. గతంలో సరైన లెక్కలు లేవన్నారు. ఎవరికి తోచిన రీతిలో వారు లెక్కలు వేసుకున్నారంటూ మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా జనాభా లెక్కించినా బీసీల గురించి పట్టించు కోలేదన్నారు.