తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేపై ప్రశంసలు కురిపించారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఈ సర్వే దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. దేశ భవిష్యత్తు కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి ఇది నిదర్శమన్నారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు, 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు ఉన్నారని, దాదాపు 90 శాతం బహుజనులే ఉండడం విస్మయ పరిచిందన్నారు. చంద్రబాబు కూడా ఏపీలో కుల గణన సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.