సోదరి సకలమ్మకు కేసీఆర్ నివాళి
NEWS Feb 04,2025 09:13 am
కొంపల్లిలో సోదరి చీటి సకలమ్మ ద్వాదశ దిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు మాజీ సీఎం కేసీఆర్. చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. సోదరితో తనకున్న బంధాన్ని కేసీఆర్ నెమరు వేసుకున్నారు. ఆమె లేక పోవడం తీరని లోటు అని పేర్కొన్నారు.