ఆత్మహత్యకు పాల్పడిన రియల్టర్ వేణుగోపాల్ రెడ్డి కుటుంబాన్ని సందర్శించారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. సీఎం ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చానని అన్నారు. కుటుంబానికి ఇబ్బందులు లేకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అంతే కాకుండా కూతురుకు ప్రభుత్వ పరంగా జాబ్ ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. హైడ్రా కూడా ఆలోచించాలని అన్నారు.