ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా అలసత్వం, అవినీతి, నిర్లక్ష్యం కనిపించ కూడదని సిఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల అమలు సక్రమంగా జరగాలని అన్నారు. ప్రజల నుంచి వస్తున్న ఫీడ్ బ్యాక్ ఆధారంగా అవసరమైన మార్పులు చేసుకుని పనిచేయాలని సూచించారు. విధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రజలు నిత్యం మనల్ని గమనిస్తూ ఉంటారని హెచ్చరించారు.