మాజీ మంత్రి ఆర్కే రోజా ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అప్పుల పేరుతో జనాన్ని బురిడీ కొట్టించేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడంటూ ఆరోపించారు. ప్రజలు ఏడు నెలలకే కూటమి పాలనపై అసంతృప్తికి గురయ్యారని అన్నారు. అడ్డగోలు హామీలతో మోసం చేశారని, అధికారంలోకి వచ్చాక వాటి గురించి ఊసెత్తడం లేదన్నారు. రోజు రోజుకు ప్రజల నుంచి వ్యతిరేకత పెరుగుతుండడంతో తట్టుకోలేక రౌడీ రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ ధ్వజమెత్తారు.