తమ పార్టీ పేరుతో గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడడం ఖాయమని స్పష్టం చేశారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దోచుకునేందుకు, తమ ఆస్తులను కాపాడుకునేందుకు పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రజలు వారిని క్షమించరని, సుప్రీంకోర్టు తప్పకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసిన వారికి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.