మంత్రి దాసరి సీతక్క ఢిల్లీ టూర్ లో బిజీగా ఉన్నారు. పలువురు మంత్రులను కలిశారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాల గురించి కేంద్ర మంత్రి అన్న పూర్ణ దేవితో చర్చించారు. తక్షణమే నిధులు విడుదల చేయాలని కోరారు.పెండింగ్ లో ఉంచడం వల్ల చిన్న పిల్లలు, బాలింతలు, గర్భిణీలకు పౌష్టికాహారం సకాలంలో అందించ లేక పోతున్నామని వాపోయారు. మంత్రి వెంట తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ ఫహీమ్ కూడా ఉన్నారు.