భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన INDIA BOOK OF RECORD IBR లో కామరెడ్డి రక్తదాతల సమూహ ప్రధాన కార్యదర్శి గంప ప్రసాద్ కి చోటు దక్కింది. రక్తధానం చేయడం, ప్రోత్సాహం కల్పించినందుకు గాను ఇండియా బుక్ రికార్డ్ లో చోటు లభించడం పట్ల గర్వకారణంగా ఉందని, ఇండియా బుక్ అవార్డు రావడానికి రక్తదాతలు సమూహమే అన్నారు. తనపై మరింత భాధ్యత పెరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.రక్తదాతల సమూహం సభ్యులు అభినందనలు తెలిపారు.