రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్ ప్రతీమా సింగ్ ముందు విచారణకు హాజరయ్యారు మోహన్ బాబు, మనోజ్. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వావాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. తన ఆస్తులు కాజేయాలని మనోజ్ చూస్తున్నాడంటూ ఫిర్యాదు చేశారు మోహన్ బాబు. దీంతో ఇద్దరిని రెండు గంటల పాటు విచారించింది. బయటకు వచ్చాక మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు ఇద్దరూ.