తెలంగాణలోని 27 జిల్లాలకు కొత్తగా అధ్యక్షులను ప్రకటించింది బీజేపీ. బీసీలకు 15 జిల్లాల్లో చోటు కల్పించింది. ఓసీలకు 10, ఎస్సీలకు రెండు చోట్ల ఛాన్స్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటంబ సర్వేను చేపట్టింది. అత్యధికంగా బీసీలు ఉన్నారని తేలింది. త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని పార్టీ బహుజనులకు ప్రయారిటీ ఇచ్చింది.