సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను తలపెట్టిన స్వర్ణాంధ్రప్రదేశ్ మోడీ తీసుకు వచ్చిన వికసిత్ భారత్ లో భాగమేనని స్పష్టం చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరపున ప్రచారం చేపట్టారు. ప్రధాని నాయకత్వంలో భారత్ వెలిగి పోతోందని చెప్పారు.వర్క్ ఫ్రమ్ హోం అనేది అంతటా మంచి అవకాశంగా మారుతోందన్నారు. వికసిత్ భారత్ ను 2047 లోపు సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందన్నారు సీఎం.