మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పై. తమ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారంటూ దుష్ప్రచారానికి తెర లేపారంటూ మండిపడ్డారు. కలిసి భోజనం చేయడం కూడా తప్పా అని ప్రశ్నించారు. సర్కార్ ను బద్నాం చేసే పనిలో బిజీగా ఉన్నారంటూ ఫైర్ అయ్యారు. కేసీఆర్ మాట్లాడిన మాటలు పూర్తిగా అబద్దమన్నారు. అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయడంలో దిట్ట అంటూ ఎద్దేవా చేశారు.