నిర్మల్ కేంద్రంలో రూ.500 నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిర్మల్ ఏఎస్పీ రాజేశ్ మీనా తెలిపారు. తానూరు మండలం బొండ్రాత్ గ్రామానికి చెందిన షేక్ ఖాదీర్ మంజులాపూర్ ఆటోస్టాండ్ వద్ద కూరగాయలు విక్రయిస్తున్న దొంగరీ వంశీ వద్దకు వచ్చాడు. రూ.140 కూరగాయలను కొనుగోలు చేసి రూ.500 నోటు అందించాడు. నోటు తేడాగా కనిపించడంతో వేరేది ఇవ్వమని అడగగా అతనితో గొడవకు దిగాడు.పెట్రోలింగ్ చేస్తున్న ఎస్సై అశోక్ అక్కడికి చేరుకుని నోటును పరిశీలించగా నకిలీదని తేలింది.