ముంబై వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన 5వ టి20 మ్యాచ్ లో భారత్ రికార్డ్ విక్టరీ నమోదు చేసింది. పంజాబ్ కుర్రాడు అభిషేక్ శర్మ దుమ్ము రేపాడు. ప్రత్యర్థి బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ నమోదు చేశాడు. 54 బంతుల్లో 135 రన్స్ చేశాడు. 7 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. శివమ్ దూబే 30, తిలక్ వర్మ 24 రన్స్ చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి భారత్ 247 రన్స్ చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ తడబడింది. 97 పరుగులకే ఆలౌటైంది.