సర్కారు కొలువు దొరకగానే వారిలో గంపెడాశలు చిగురించాయి. గ్రూప్-4 పరీక్ష పాసయ్యారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు 44 మంది ఉద్యోగులను కేటాయించా రు. వారిలో 33 మంది బల్దియా కార్యాలయంలో రిపోర్టు చేశారు. కమిషనర్ దిలీప్‌కుమార్‌ను కలిసి విధుల్లో చేరారు. తర్వాత మొదలైంది అసలైన సమస్య. తామేం చేయాలో వారికి తెలిడం లేదు. విధుల్లోకి తీసుకున్నారు తప్ప విధి విధానాలు వివరించలేదు. అధికారులు ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం చేపట్టలేదు.