అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ
NEWS Feb 02,2025 02:42 pm
వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్ తో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 41 బంతుల్లో శతకం బాదాడు. స్టేడియం నలు వైపులా ఫోర్లు , సిక్సర్ల మోత మోగించాడు. ఇందులో 10 సిక్సర్లు , 6 ఫోర్లు ఉన్నాయి. సంజూ శాంసన్ 17 రన్స్ చేయగా, తిలక్ వర్మ 24, సూర్య కుమార్ యాదవ్ 2, శివమ్ దూబే 30 పరుగులు చేశారు. భారత్ భారీ స్కోర్ చేసింది.