మహిళల అండర్ -19 వరల్డ్ కప్ ను కైవసం చేసుకున్న భారత జట్టును ప్రశంసలతో ముంచెత్తారు సీఎం చంద్రబాబు. 9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా జట్టును మట్టి కరిపించిన అమ్మాయిలకు ప్రత్యేకంగా కంగ్రాట్స్ తెలిపారు. మీరు సాధించిన విజయం నేటి యువతకు స్పూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని కోరారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన గొంగడి త్రిష, షబ్నంలను ప్రత్యేకంగా అభినందించారు.