నాగోబా దర్బార్ పై ఎన్నికల ఎఫెక్ట్
NEWS Feb 02,2025 11:56 am
ఆదివాసీలు అత్యంత పవిత్రంగా పూజలు చేసే నాగోబా సన్నిధిలో జరిగిన దర్భార్ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి తలిగింది. నాగోబా దర్భార్ను ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యం దృష్ట్యా అధికారులు నిర్వహించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో కొలువుదీరిన నాగోబా జాతరకు రోజు రోజుకు జనం తాకిడి పెరుగుతుంది .నాగోబాకి జిల్లా కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూ, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్, ఆలయ చైర్మన్ మెస్రం ఆనంద్ రావ్, ఉట్నూర్ ఏఎస్పీ కాజల్, డీఏఫ్ఓ ప్రశాంత్ పాల్గొన్నారు.