ఆదివాసీల కుంభ మేళా కెస్లాపూర్ నాగోబా జాతర అధికారికంగా ముగిసింది. ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా పూజలందుకున్న నాగోబా దేవతకు పూజలతో జాతరను ముగించారు. మెస్రం వంశీయులు నాగశేషుడికి మనసారా మొక్కి వెళ్లొస్తాం నాగోబా అంటూ కెస్లాపూర్ నుంచి బుడుందేవ్ పూజలకు శ్యాంపూర్ బాట పట్టారు. పూజలు ముగిసినా భక్తుల దర్శనార్ధం మరో రెండు రోజుల పాటు జాతర సాగనుంది.