ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆయా కలెక్టరేట్ లలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలు రద్దు చేస్తూ కలెక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం తెలిపారు. కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి రద్దు చేస్తున్నట్లు తెలిపారు.