మలేషియా వేదికగా జరిగిన మహిళల అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో అద్భుతమైన ప్రతిభను చాటింది తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష. సౌతాఫ్రికాతో జరిగిన ఈ కీలక పోరులో అటు బౌలింగ్ లోనూ ఇటు బ్యాటింగ్ లోనూ సత్తా చాటింది. 44 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచింది. 3 కీలక వికెట్లు తీసింది. అంతే కాదు టోర్నీలో సెంచరీ చేసిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచింది.